Showing posts with label ఊరికే... Show all posts
Showing posts with label ఊరికే... Show all posts

Sunday, September 27, 2009

మనసు

లేనిదాన్ని ఉందనుకొని
ఉన్నవీ లేనివీ ఊహించుకొని
ఊసులన్నింటినీ ఊహల్లో ఊరబెట్టి
లేనిది లేదనే ఉన్న నిజం తెల్సాక
ఊసురోమంటుంది - ఉరేసుకుంటానంటుంది

Wednesday, September 23, 2009

నీడ

నా నీడ..
నేను నడిస్తే నడుస్తుంది.
నేను ఆగితే ఆగుతుంది.
నేను నవ్వితే నవ్వుతుంది.
నన్ను నాకు అరుదైన విచిత్రంలా చూపుతుంది.

నన్ను వీడి ఓ క్షణం కూడా ఉండలేదేమోనన్నంత భ్రమ కలిగించి, నేను చీకటిలో దాగగానే మాత్రం చిట్టుక్కున్న మాయం అవుతుంది. అచ్చు.. నీలా..

నీడ తోడు కావాలనుకుంటే వెలుతురు తప్పనిసరి!