Saturday, December 31, 2011

పుస్తకం.నెట్‍తో మూడో ఏడాది


(నా తెలుగు బ్లాగులో ఫిక్షన్ తప్ప మరేం రాయనని మడి కట్టుకున్నాను. అందుకని ఈ ఆనవాయితీ పోస్టును వాయిదా వేద్దామనుకున్నాను గానీ, నేనెంత పనిదొంగనో ఒప్పుకోవటంలో నాకు బోలెడంత నిజాయితి కూడా ఏడ్చింది కాబట్టి, ఇక్కడ.. ఇలా..)

2011  హోల్ మొత్తంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండీ లేనట్టూ, లేకున్నా ఉన్నట్టూ, ఉండడానికి లేకపోవడానికి మధ్యనున్నట్టూ ఏదోదో అనిపిస్తోంది. చేతిలోని పర్సో, మొబైలో "అర్రె.. ఇక్కడే ఉండాలి. ఎక్కడ పోయింద"ని వెతుక్కున్నట్టు ఈ ఏడాదినీ వెతుక్కోవాల్సి వచ్చిందిలే! ఇహ, అందులో మళ్ళీ పుస్తకం.నెట్ విశేషాలంటే ఏం రాస్తానో ఏమో? మొదలైతే పెట్టాను కాబట్టి.. ఖాళీ పేపర్ అయితే ఇవ్వనులే.. జై జె.ఎన్.టి.యు..

2010 ముగింపులో పుస్తకం పనుల మీద చాలా తిరిగాం. అదే 2011 మొదట్లో కూడా బాగా కొనసాగుతుందని ఆశించాను. విజయవాడ పుస్తక ప్రదర్శన కాస్త నిరాశపరిచినా శ్రీశ్రీ ప్రింటర్స్, నవోదయ రామ్మోహనరావుగారిని, తనికెళ్ళ భరణిని, పాత పుస్తకాల నాగేశ్వరరావుగారిని కలవటం ఆనందం కలిగించింది. కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. కాకపోతే కొద్దిలో నండూరి రామ్మోహనరావుగారిని కలవటం తప్పిపోయింది నాకు. And I always knew, I lost once in a life time opportunity!

జనవరి నెలలోనే పుస్తకం అడ్మిన్ పనుల నుండి తప్పుకోవాలనుకున్నాను. అదే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను. ఫిబ్రవరిలో రమణగారు పోవటం - one of most tragic phase in my life. వినగానే ’ఓహ్.. ’ అని మాత్రమే అనిపించింది కానీ, గడిచిన కొద్ది చాలా బాధపెట్టింది ఆ నిజం. దాంతో ఓ shellకి వెళ్ళిపోయి, పుస్తకాన్ని దాదాపుగా మర్చిపోయాననే గుర్తు. Loads of inaction, dumbness and numbness - చాలా కారణాలనుకోండి, అలా అవటానికి. సో.. పుస్తకం పనులేం చేయకుండా, అసలేం రాయకుండా, ఎవర్ని రాయమని విసిగించకుండా కాలం గడిచిపోయింది. ఆ నిర్లిప్తత కొద్దిమందికైనా సాంత్వన కలిగించిందనే అనుకుంటున్నాను. ;)

మనుషులని కలవటం, వారి చేత మాట్లాడించటం కొద్దిగా backseat తీసుకున్నా, పుస్తకాలు చదవటం నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరిగింది. ఎప్పటిలానే ఒక పద్ధతి పాడూ లేకుండా ఏ పుస్తకం చేతికందితే దాన్నే చదవానరంభించి నచ్చితే పూర్తిచేయటం, లేకపోతే వదిలేయటం. మధ్య్లలో ఎప్పుడో కొంచెం అలసత్వాన్ని వెనక్కి నెట్టి పుస్తకాలను గూర్చి బుద్దిగా రాసాను కొన్నాళ్ళు. నచ్చినప్పుడు నచ్చిందని చెప్పడానికి వెనుకాడినా, నచ్చకపోతే మాత్రం వచ్చి అక్షింతలు వేస్తారని తెల్సింది. At least, I was being read - wow moment, no? :P

దానికన్నా ముఖ్య విషయం. నేను పుస్తకం నుండి తప్పుకుంటున్నానని చెప్పినప్పుడే చెప్పాను, రాస్తూ ఉంటాను. అయినా కూడా జనాలు "మీరు వెళ్ళిపోతున్నా అన్నారు? ఇంకా ఎందుకు రాసి విసిగిస్తున్నట్టు?" అన్న ధ్వనిలో ప్రశ్నలు అడిగారు, అడుగుతున్నారు. సమాధానం చాలా సింపుల్.. పుస్తకం తెర వెనుక ఉంటేనే పుస్తకంలో రాయాలని ఏమీ లేదు. పుస్తకం నిరవధికంగా నడవడానికి ఒక్కరో, ఇద్దరో కారణం కారు, కాలేరు. అందులో చాలా మంది భాగస్వామ్యం ఉంటుంది. రమణగారిలా చెప్పాలంటే ’సమిష్టి వ్యవసాయం’. పుస్తకం.నెట్ అనే తోటలో ఏదో మూల ఎన్నుకొని అందులో ఇష్టమైన మొక్కను నాటుకొని, పూలు పూయించుకోవచ్చును. దానికి భూమంతా వారి పేరు మీద ఉండాలనేమీ లేదు.

ఒక వెబ్‍సైట్ అడ్మిన్లకుండే తలనొప్పులు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళని పొగిడేవాళ్ళకన్నా అటు-ఇటు అయ్యే క్షణాల కోసం కాచుకొని కూర్చొని, వాళ్ళని అనడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటారు. నచ్చినప్పుడు అవసరానికి మించి పొగుడుతారు. నచ్చనప్పుడు baseless allegations చేస్తుంటారు. లోకం తీరంత అని వదిలేయటం ఒక పద్ధతి. కానీ ఎప్పుడోకప్పుడు ఏ రాళ్ళు తగులుతున్నాయో, అవి చేతుల్లోకి వచ్చే అవకాశమూ ఉంది, వాటిని తిప్పి కొట్టే అవకాశమూ ఉంది. The so called sense of humour కొట్టే, కొట్టించుకునే వాళ్ళకే ఉంటాయి గానీ, రాళ్ళకి ఉండదు! :)

బెంగళూరులో బుక్‍వార్మ్ వాళ్ళతో ముచ్చటించటం కొంచెం పాత రోజుల్ని గుర్తుతెచ్చింది. ఆ వెంటనె గయ్ డి అనే లింగ్విస్ట్ తో ఈ-మెయిల్ సంభాషణ మరింత నచ్చింది. ఆయనంత త్వరగా ఒప్పుకుంటారని గానీ, లేక అంత తీరిగ్గా జవాబులిస్తారని గానీ ఊహించలేదు.

ఈ ఏడాది మరో అపురూప పరిణామం - జంపాల గారి వ్యాసావళి. అందరి వెంటపడినట్టే వీరిని పుస్తకంకు రాయమని మొదట అడిగినప్పుడు "నా ప్రొఫెషన్ అంత సమయం మిగల్చదు" అని అన్నారు. అదీ నిజమేనని ఊరుకున్నాం. కానీ వారం తర్వాత వారం ఆయన రాస్తూనే ఉండింది ముందు అబ్బుర పరిచింది, తర్వాత కొంచెం అసూయ కలిగించింది, చివరకు ఆయనకు నమో నమః చెప్పేసుకున్నాం లే! అంతలా, రాస్తూనే ఉన్నారు. Amazing insipration! కేవలం పుస్తకం విషయంలోనే కాదు, మనిషికి డిసిప్లెన్ ఉంటే ఎన్ని పనులు చేసుకోవచ్చోనని చూపారు. చదవటం, రాయటంకన్నా ఆయనలో నాకు చాలా నచ్చేవి.. the passion to communicate! Simply mind blowing!

ఏదో ప్రళయం వస్తే తప్ప మేం థీం మార్చేలా కనిపించలేదు. అలాగే, హాక్ అయ్యే పరిస్థితులు తప్పించుకొని ఎట్టకేలకు ఆ పాత బట్టలను వదిలి కొత్త బట్టలు వేసాం. అవేమో అంతగా అతికనట్టు లేవుగానీ, ప్రస్తుతానికి అలా కొనసాగించాల్సి వస్తుంది. దాన్ని కొంతైనా ఒక తీరు తెన్నూ తేవాలని ప్రయత్నం. చూడాలి!

తెర వెనుకున్నా, ముందున్నా, తెరనే ముసుగేసుకున్నా పుస్తకం అనేది ఒక ’కొంచెం ఇష్టం. కొంచెం కష్టం’ వ్యాపకంగా అలవాటయ్యిపోయింది. ఈ ఏడాది మేమిద్దరం కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించినా, పుస్తకం బాగానే నడిచింది. మున్ముందు మమల్ని అనాసక్తులూ, అలసత్వాలూ ఆవహించకుండా ఉంటే మా వంతుగా చేయాల్సింది మేము చేస్తాం. ఆనక whosoever's ఆధీనం!  



Sowmya's recap: http://vbsowmya.wordpress.com/2011/12/31/3yrspustakam-net/

1 comment:

Anonymous said...

మీరు పుస్తకం వెనుకనుంచి ముందుకొచ్చేస్తే మరి కొత్తగా ఎవరైనా పుస్తకం వెనుకకు వెళ్లి నడిపిస్తున్నారా?
ఏదేమైనా పుస్తకం.నెట్లో మీరు శైలిపరంగా చాలాచక్కని దశకి చేరుకున్నారు.పుస్తకవిశ్లేషణలకు రంగు, రుచి, వాసన కల్పిస్తున్నారక్కడ. మీరు పుస్తకంలో మరింత ఎక్కువగా రాయాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.